మనవడి విజయానికి తబ్బిబవుతున్న కేసీఆర్…

మనవడి విజయానికి తబ్బిబవుతున్న కేసీఆర్…

ముఖ్యమంత్రి హోదాలో బయట ఎలా ఉన్నా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మనవళ్లతో కేసీఆర్‌ చంటిపిల్లాడిలో మారిపోతారని కేసీఆర్‌ సన్నిహితులు చెబుతారు.అసలు కంటే కొసరు ముద్దు అన్న చందంగా కొడుకు,కూతురు కంటే వారి పిల్లలతోనే కేసీఆర్‌ ఎంతో చనువుగా ఉంటారు.అందులోనూ మనువడు కల్వకుంట్ల హిమాన్షురావు అంటే కేసీఆర్‌కు ప్రత్యేకమైన ప్రేమ,వాత్సల్యం చూపుతారు.గతంలో పలు కీలక కార్యక్రమాలకు,ఇతర వ్యక్తగత కార్యక్రమాలకు కూడా తన వెంట మనువడిని తీసుకెళ్లిన వైనం ప్రతీ ఒక్కరినీ ఆకర్షించింది.కొంతమంది దీనిపై విమర్శలు,ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసిందే.ఇక హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఎనిమిదవ తరగతి చదువుతన్న హిమాన్షు ఓ జాతీయస్థాయి పోటీలో పాల్గొనడమే కాకుండా బంగారు పతకం సాధించడంతో కేసీఆర్‌ ఉబ్బితబ్బిబవుతున్నారు. పర్యావరణ పోటీల్లో భాగంగా హిమాన్షు బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు.డీహెచ్ ఎఫ్ ఎల్ అనే బీమాసంస్థ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక పోటీని నిర్వహించింది.  ఇందులో ఎవరైతే పునరుత్పాదక వ్యర్థాల్ని ఎక్కువగా సేకరిస్తారో వారికి బహుమతి వస్తుంది. ఈ పోటీలో మిగిలిన వారి కంటే ఎక్కువగా హిమాన్షు మొత్తం 34వేలకు పైగా కేజీల వ్యర్థాల్ని సేకరించారు. దీంతో అతనికి మొదటిస్థానం లభించింది. మూడో స్థానం కూడా అదే స్కూల్ కు చెందిన మరో విద్యార్థి సొంతం చేసుకున్నారు.తన గారాల మనవడు జాతీయస్థాయి పోటీలో బంగారు పతకాన్ని సాధించడంతో కేసీఆర్‌ ఆనందానికి పట్టపగ్గాల్లేవని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos