కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది?

కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది?

హైదరాబాదు: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో బహిర్గతం చేసేందుకు చర్యల్ని తీసుకోవాలని కోరతూ నవీన్ (తీన్మార్ మల్లన్న) శుక్రవారంఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ‘గత కొంత కాలంగా కేసీఆర్ కనిపించడం లేదు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. నిజాలు తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నార’నివ్యాజ్యంలో పేర్కొన్నారు. విచారణ చేసిన న్యాయస్థనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ గిమ్మిక్కులు చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించలేమని తెలిపింది. ముఖ్యమంత్రి ఆచూకీ గురించి హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని దాఖలు చేసుకోవాలని సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos