కేసీఆర్ జాతీయ పార్టీ కోసం మరో రెండు చానళ్లు..?

కేసీఆర్ జాతీయ పార్టీ కోసం మరో రెండు చానళ్లు..?

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ కోసం మరో రెండు చానళ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ కేంద్రంగా హిందీ, ఇంగ్లీష్ ఛానళ్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. కొత్త ఛానళ్ల కోసం శాటి లైట్ అనుమతులు తీసుకోవాలా? లేక ఇప్పటికే అనుమతులు ఉన్న ఛానళ్లతో ఒప్పందం చేసుకునే విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. చానల్స్ ఏర్పాటు కోసం టీఎర్ఎస్ పెద్దలు ఢిల్లీలో సీనియర్ జర్నలిస్టులతో సంప్రదిం పులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత అదే భవనంలో చానల్స్ ఏర్పాటు చేసే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, అప్పటి వరకు టి న్యూస్ నెట్ వర్క్ను అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos