వీరపాండ్య కట్టబొమ్మనకు ఘన నివాళి

హొసూరు : స్వాతంత్య్ర సమర యోధుడు, అచ్చ తెలుగువాడిగా పేరుగాంచిన వీరపాండ్య కట్టబొమ్మన 220 వర్ధంతిని సూలగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వీరపాండ్య కట్టబొమ్మన అజరామరుడని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్లాఘించారు. పాఠశాల ఆవరణలో కట్టబొమ్మన చిత్రపాటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి తరం స్వాతంత్య్ర సంగ్రామ యోధుడుగా ఆంగ్లేయులతో పోరాటం చేసిన ఆ వీరుని సాహస కృత్యాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించడంతో పాటు కట్టబొమ్మన ధైర్య సాహసాలను మననం చేసుకున్నారు.

తాజా సమాచారం