ప్రభుత్వం పూచీ లేదు

ప్రభుత్వం పూచీ లేదు

ప్రజావాహిని-బెంగళూరు

విద్యుత్‌ సరఫరాలో కలిగే లోపాలు, అంతరాయాలు, ఇతర సమస్యల వల్ల వ్యవసాయ బావులకు అమర్చిన మోటార్లు కాలిపోతే దానికి ప్రభుత్వం  బాధ్యత వహిందని, పరిహారాన్ని చెల్లించే ప్రసక్తే లేదని మంత్రి సునిల్‌ కుమార్‌ పరోక్షంగా తెలిపారు. గురువారం విధానసభలో హరపనహళ్లి సభ్యుడు కరుణాకర రెడ్డి లేవనెత్తిన ఈ సమస్యకు సునిల్‌ కుమార్‌  బదులివ్వలేదు. ఆ పరిస్థితి తలెత్తకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యల్నీ తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని 24 గంటల్లోగా బిగిస్తామని చెప్పారు. వాటి మరమ్మతు కేంద్రాలను 159 నుంచి 169కి పెంచామన్నారు. ట్రాన్స్‌ ఫార్మర్ల మరమ్మతు, రవాణా వ్యవస్థ తదితరాల్ని పర్యవేక్షించేందుకు నూరు రోజుల వ్యవధిలో ప్రత్యేక యాప్‌ను సిద్దం చేయనున్నట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos