‘ఆ కేసులు అన్నీ బోగస్​’

‘ఆ కేసులు అన్నీ బోగస్​’

న్యూఢిల్లీ: చైనీయులు వీసాలు పొందడంలో సాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్పార్టీ లోక్సభ సభ్యుడు కార్తీ చిదంబరం ను ఇక్కడి సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికార్లు విచారించారు. కార్యాలయానికి వెళ్లేముందు కార్తీ విలేఖరులతో మాట్లాడారు.‘ నాపై పెట్టిన కేసులన్నీ బోగస్ . నేను ఒక్క చైనా జాతీయుడికి కూడా వీసాలు ఇప్పించలేదు’అన్నారు. విచారణ కోసం బుధవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని కార్తీకి తాఖీదు జారీ చేసింది. కార్తీ తరపు న్యాయవాది సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చినపుడు కార్తీ చిదంబరమే స్వయంగా రావాలని చెప్పి నట్లు వెల్లడించారు. సుమారు రూ. 50 లక్షలు తీసుకుని చైనాకు చెందిన 250 మందికి కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos