‘విరుమాన్’ నుంచి కార్తి ఫస్టులుక్

‘విరుమాన్’ నుంచి కార్తి ఫస్టులుక్

చెన్నై :నటుడు కార్తి  తాజా చిత్రం- విరుమాన్ రూపొందుతోంది. సూర్య  సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ముత్తయ్య దర్శకుడు. కార్తి పూర్తి మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన ఫస్టులుక్ ను కొంత సేపటి క్రితం విడుదల చేశారు. అందులో పంచె కట్టి,  బల్లెం వంటి ఆయుధాన్ని ధరించి  అన్నిటికీ తెగించినవాడిలా  రాళ్ల గుట్టపై కూర్చున్నాడు. కథానాయిక అదితి శంకర్.  డైరెక్టర్ శంకర్ కూతురే ఈమె.  ఈ సినిమాతోనే ఆమె తమిళ తెరకి పరిచయమవుతోంది. మరో సినిమాను శింబు జోడీగా చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos