హొసూరు కాళికాంబ దేవాలయంలో లక్ష దీపార్చన

హొసూరు : స్థానిక తేరుపేటలోని కొండపై గల పురాతన కాళికాంబ దేవాలయంలో కార్తీక మాస సోమవారం సాయంత్రం లక్ష దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో ఏటా కార్తీక మాసంలో విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా కాళికాంబకు కుంకుమార్చన, వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి,

తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos