కర్ణాటక అధికారిక చిహ్నం చరిత్ర తెలుసా!

కర్ణాటక అధికారిక చిహ్నం చరిత్ర తెలుసా!

భిన్నత్వంలో ఏకత్వంగా అన్నిమతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ప్రజలకు స్వేచ్ఛ,హక్కులు ఇచ్చిన దేశం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క భారతదేశం మాత్రమే. జీవనదులు, అడవులు, వ్యవసాయం.వేలాది భాషలు,సంస్కృతులు,ఆచారావ్యవహారాలతో భారతదేశం ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు కలిగిఉంది.దేశానికి గుర్తింపు దక్కడం వెనుక 29 రాష్ట్రాలు,తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల సమైక్యత కూడా దాగిఉంది.29 రాష్ట్రాలకుగానూ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చరిత్ర,గుర్తింపు ఉన్నాయి.ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు నిలయమైన దక్షిణాదిలోని అతిపెద్ద రాష్ట్రం కర్ణాటకకు కూడా తనదైన గుర్తింపు,చరిత్ర ఉన్నాయి.కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఎన్నో ఘట్టాల్లో ఒకటైన కర్ణాటక రాష్ట్ర అధికారిక చిహ్నం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగిఉన్నాయి.1510లో విజయనగర రాజుల కాలం హయాంలో వినియోగించిన  నాణేలపై ప్రస్తుత చిహ్నాన్ని ముద్రించారు.విజయనగర రాజుల అనంతరం హొయ్సళ,కెలాడిస్‌,కదంబ రాజులు కూడా ఈ చిహ్నాన్ని అధికారిక ముద్రగా వినియోగించారు.అలా మైసూరు రాజవంశస్థులతో పాటు అనంతరం దేశాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు సైతం ఈ చిహ్నాన్ని కొనసాగించారు.ఇలా శతబ్దాలుగా రాజముద్రగా పరిగణించబడుతూ వచ్చిన ఈ చిహ్నం మైసూరు రాష్ట్రంగా(1973లో మైసూరు రాష్ట్రం కర్ణాటకగా పేరు మార్చుకుంది)ఏర్పాటైన అనంతరం ఈ చిహ్నాన్ని మైసూరు రాష్ట్ర అధికారిక ముద్రగా వినియోగిస్తున్నారు.కర్ణాటక రాష్ట్ర అధికారి చిహ్నాన్ని పరిశీలిస్తే మధ్యలో మూడు సింహాలు,రెండు తలల హంస,ఇరు వైపులా ఏనుగు,సింహం కలిపి ఉండే జంతువు ఉంటాయి.దేశంలోని ప్రముఖ హిందూ దేవాలయాల్లో చెక్కిన శిల్పాల ఆధారంగా ఈ చిహ్నాన్ని రూపొందించినట్లు చరిత్రద్వారా తెలుస్తోంది.కెలాడిలోని రామేశ్వర ఆలయంలోని గండభేరుండ శిల్పం,పౌరాణి గాధల్లో పేర్కొన్న ఏనుగు,సింహం శరీరాలు కలగలిపి ఉంటే అతిక్రూరమైన శరబ అనే ప్రాణి ఆధారంగా చిహ్నం రూపొందించారు.

రామేశ్వర ఆలయంలోని గండభేరుండ శిల్పం

శరబ ప్రాణి వెనుక మరో చరిత్ర దాగి ఉంది.నరసింహ అవతారం అనంతరం విష్ణువు రౌద్రం,కోపం నుంచి సృష్టిని రక్షించడానికి శివుడు ఏనుగు,సింహం కలగలపిన శరబ అనే కొత్త ప్రాణి అవతారం ధరించగా శరబతో పోరాడడానికి నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు గండభేరుండ అవతారంలోకి మారాడు.విష్ణువు,శివుడు అవతరాలైన గండభేరుండ,శరబలతో కూడిన చిహ్నం రూపొందించారు.గండభేరుండ,శరబ చిహ్నాన్ని విజయనగర రాజులు మాత్రమే కాదు కోటరాజులు,చాగీస్‌,చాళుక్యులు,మైసూరు ఒయడర్‌ రాజవంశస్థులు సైతం అధికారిక చిహ్నంగా వినియోగించారు.

విష్ణువు గండభేరుండ అవతారం

కాలక్రమేణ చిహ్నంలో గండభేరుండ,శరబతో పాటు అశోకచక్రం,మూడు సింహాలు,సత్యమేవ జయతే వ్యాక్యం చేర్చి కర్ణాటక రాష్ట్ర అధికారిక రాజముద్రగా అందుబాటులోకి తెచ్చారు.కర్ణాటక రాష్ట్ర చిహ్నాన్ని ప్రభుత్వ ఆదేశాల జారీ పత్రాలతో పాటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ రవాణ సంస్థ బస్సులపై కూడా అధికారికంగా వినియోగిస్తున్నారు.వీటితో పాటు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా బెంగళూరు ఫుట్‌బాల్‌ క్రికెట్‌ క్లబ్‌,కన్నడ వేదిక కల్చరల్‌ క్లబ్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక సంస్థ కూడా గండభేరుండను అధికారిక చిహ్నం(లోగో)గా వినియోగిస్తున్నాయి.

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos