కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన

కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన

కర్నాల్ : హర్యానా రైతులపై లాఠీచార్జ్కు నిరసనగా వారు చేపట్టిన నిరసన బుధవారం – రెండో రోజుకి చేరింది. మంగళ వారం రాత్రి వందలాది మంది రైతులు కర్నాల్ మినీ సచివాలయం ప్రధాన ప్రవేశ ద్వారం గుడారాల్లో బైఠాయించారు. భవిష్యత్ కార్యాచరణపై కొంత వివరణ ఇచ్చారని, చర్చలు జరుగుతున్నాయని భారతీయ కిసాన్ యూని యన్ (బికెయు) నేత రాకేష్ తికాయత్ తెలిపారు. ఎస్డిఎం ఇచ్చిన ఆదేశాలపై వివరణ ఇచ్చేందుకు అధికారులు యత్నించారని, తమ తదుపరి చర్యలపై నిర్నయం తీసు కు నేందుకు రైతులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. అవసరమైతే రైతుల తలలు పగల గొట్టండన్న కర్నాల్ మాజీ ఎస్డిఎమ్ ఆయుష్ సిన్హాపై చర్యలు తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు డిమాండ్ చేస్తున్నారు.పలు జిల్లాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటివరకు సెక్రటేరియట్లోని వ్యక్తు లు, ఉద్యోగులపై ఎటువంటి ఆంక్షలు విధించ లేదు. ఇంటర్నెట్ సేవల నిషేధాన్ని మరో రోజు పొడిగించింది.

తాజా సమాచారం