కర్నాల్ లాఠీచార్జిపై న్యాయ విచారణ

కర్నాల్ లాఠీచార్జిపై  న్యాయ విచారణ

కర్నాల్: నగరంలో గత ఆగస్టు 28న పోలీసులు జరిపిన లాఠీచార్జీ ఘటనపై న్యాయ విచారణకు, హర్యాన ప్రభుత్వం అంగీకరించటంతో అన్నదాతలు ఆందోళన విరమిం చారు. ఇంకా మృతి చెందిన రైతు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం ఇస్తామనీ ప్రభుత్వం ప్రకటించింది. హర్యానా అడిషనల్ చీఫ్ సెక్రటరీ దేవేందర్ సింగ్ రైతు ప్రతినిధులతో కలిసి శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మృతి చెందిన రైతు సతీష్ కాజల్ కుటుంబంలోని ఇద్దరికి ఉద్యోగాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. లాఠీచార్జి ఘటనపై రిటైర్ట్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తాం. దర్యాప్తు నెల రోజుల్లో ముగుస్తుంద’ని విపులీకరించారు. రైతు నేత గుర్నాం సింగ్ చౌరుని కూడా మాట్లాడారు.‘లాఠీచార్జి ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేసాం. ప్రభుత్వం అంగీక రించింది. వారంలోకి వారికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్‌డీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అనుకున్నప్పటికీ పోలీసు విధుల పేరుతో బయటపడే అవకాశాలున్నాయని న్యాయ వాదులు ఇచ్చిన సలహా మేరకు రిజైర్ట్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశాం. దీనికీ ప్రభుత్వం అంగీకరించింద’ని విపులీకరించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ పాల్గొన్న కార్యక్ర మానికి నిరసన తెలిపేందుకు ఆగస్టు 28న రైతు సమావేశమయ్యారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జి జరపడంతో పలువురు గాయ పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆల్ ఇండియా కిసాన్ సభ నేత కాజల్ గుండెపోటు వచ్చి కన్నుమూశారు. పోలీసు లాఠీచార్జిపై సెప్టెంబర్ 7 నుంచి రైతులు కర్నాల్ మినీ సెక్ర టే రియట్ వద్ద ప్రదర్శనలకు దిగారు.

తాజా సమాచారం