కంగన పై సమాజం కన్నెర్ర్ర

కంగన పై సమాజం కన్నెర్ర్ర

న్యూ ఢిల్లీ : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు అందించిన పద్మ శ్రీ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీతో సహా పలుపార్టీల నేతలు సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. తమెకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. టైమ్స్ నౌ అనే జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కంగనా రనౌత్ బ్రిటిష్ పాలనకు కొనసాగింపే కాంగ్రెస్ పార్టీ పాలన అని రోపించారు. 1947లో బ్రిటీష్ వాళ్లు మనకు భిక్షం వేశారని నోరు పారేసుకున్నారు. నిజానికి దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని సెలవిచ్చారు. ‘కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. వాటిని ఉపేక్షించలేమ’ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ‘స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఆమె అవహేళన చేసింది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ సారథ్యంలో జరిగిన స్వాతంత్ర్య సమరాన్ని అగౌరవపచడమే కాకుండా తిరుగు బాటుదారులు సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా మరెందరో అమరుల ప్రాణ త్యాగాలను కించపరిచార’ని ట్విట్టర్లో ఆగ్రహించారు. ‘పద్మ శ్రీ వంటి అవార్డులు ఇచ్చేటప్పుడు వారి మానసిక పరిపక్వతనూ పరిగణనలోకి తీసుకోవాలి. తద్వార దేశానికి, దేశ యోధులనూ అగౌరవ పరచకుండా చర్యలు తీసుకున్నవారమవుతాము. పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంటనే వెనక్కి తీసు కోవాల’ని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు విచక్షణా రహితంగా ఉన్నాయని హర్యానా మాజీ సీఎం భుపిందర్ సింగ్ హూడా న్నారు. ‘కంగనా రనౌత్‌కు ఇచ్చిన పద్మ శ్రీ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే గాంధీ, నెహ్రూ, పటేల్, భగత్ సింగ్, కలాం, ముఖర్జీ, సావర్కర్ వీరంతా.. స్వాతంత్ర్యం కోసం అడుక్కున్నారనే ప్రపంచం అర్థం చేసుకునే ముప్పు ఉంది. ఇక మీదట మీడియా కూడా ఆమెను ప్రేలాపనల్ని ప్రసారం చేయకుండా తీర్మానించాల’ని హిందుస్తానీ అవామ్ మోర్రచా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ డిమాండు చేసారు. ‘కంగనా రనౌత్‌పై దేశద్రోహం మోపాలి. పద్మ శ్రీ అవార్డును వెంటనే ఉపసంహరించాల’ని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. ‘ ఆమె స్వాతం త్ర్య సమర యోధులను అగౌరవ పరిచారు. ప్రభుత్వం వెంటనే పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకుని అరెస్టు చేయాలి. హిమాచల్ ప్రదేశ్‌లోనే పెరిగే ఓ రకమైన హషిష్ మత్తు పదార్థం-మలానా క్రీమ్ ను కొంచెం ఎక్కువ తీసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తున్నద’ని మహారాష్ట్ర మంత్రి, నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ‘కంగనా రనౌత్ ది పిచ్చి తనం అనాలా? దేశద్రోహం అనాలా? అర్థం కావడం లేదు. కొన్నిసార్లు గాంధీని కించ పరుస్తారు. మరోసారి ఆయనను చంపిన వారిని పొగడుతారని లోక్‌సభ సభ్యుడు వరుణ్ గాంధీ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos