వీడియో విడుదల చేసిన కల్కి దంపతులు..

వీడియో విడుదల చేసిన కల్కి దంపతులు..

ఐటీ అధికారుల దాడుల్లో వందల కోట్లు ఆస్తులు బయటపడడంతో కొద్ది రోజులుగా అజ్ఞాతంలో గడుపుతున్న కల్కి ఆశ్రమం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. దేశం విడిచి పారిపోయామంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తమ ఆశ్రమాల ప్రధాన కార్యాలయాల్లో ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయని విజయ్ కుమార్ దంపతులు వీడియోలో చెప్పుకొచ్చారు. తమ ఆరోగ్యం బాగుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.కాగా వ్యవస్థాపకులు ఇద్దరు తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం ఓ ప్రకటన చేసింది.

తాజా సమాచారం