బెంగళూరు : మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను బెంగళూరులో ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐదు రోజులుగా పోలీసులకు దొరక్కుండా జానీ మాస్టర్ తప్పించుకు తిరుగుతున్నారు. నెల్లూరు, తదితర ప్రాంతాల్లో గాలించిన పోలీసులు బెంగళూరులో ఉన్నట్టు జానీ మాస్టర్ ను అదుపులో తీసుకున్నారు. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్లో ఆయన తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్‌ను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో యాడ్ చేశారు.