మత మార్పిడి నిషేధ చట్టం

మత మార్పిడి నిషేధ చట్టం

ప్రజావాహిని-బెంగళూరు

ఉత్తర ప్రదేశ్‌ మాదిరి మత మార్పిడి నిషేధ చట్టాన్ని కర్నాటకలోనూ అమలుకు పరిశీలిస్తున్నట్లు హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మంగళ వారం విధానసభలో వెల్లడించారు. శూన్య వేళలో భాజపా సభ్యుడు గూళిహట్టి శేఖర్‌ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న మత మార్పిడీలకు అడ్డు కట్ట వేయాలని కోరారు.  తన తల్లితో బాటు తమ చిత్రదుర్గ జిల్లాలో కనీసం పదహైదు , ఇరవై వేల మంది క్రైస్తవానికి మారారని చెప్పారు. వివిధ రోగాల నివారణకు వెళ్లిన వారిని క్రైస్తవ మిషనరీలు మనస్సు మార్చి తమ మతంలోకి మళ్లి స్తున్నారని ఆరోపించారు. దళితులు, వెనుకబడిన వర్గాల వారితో బాటు ముస్లింలనూ క్రైస్తవానికి ఆకర్షిస్తున్నారని చెప్పారు. క్రైస్తవ మత ప్రభావంతో తన తల్లి ఇంట్లో కుంకు మ, పూలు వాడకాన్ని నిలిపేసిందన్నారు. చివరకు సెల్‌ఫోన్‌ రింగ్‌ టోన్‌ కూడా క్రైస్తవ భక్తి గీతాలని వివరించారు. దరిమిలా తాము బంధువుల ఇళ్ల ల్లో పూజా పునస్కా రాలకు నోచుకోలేక పోతున్నాని ఆక్రోశించారు. మిషనరీల చర్యల్ని ఆక్షేపించిన వారిపై  చర్చిలు అత్యాచార, దౌర్జన్య కేసుల్ని దాఖలు చేస్తున్నాయిని  ఆరోపిం చారు. ఏ చర్చి తప్పుడు కేసులు దాఖలు చేసిందో నిర్ధిష్టంగా తెలపాలని మాజీ హోం మంత్రి జార్జి కోరారు. మంత్ర ఆరగ జ్ఞానేంద్ర కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీక రించారు. బలవం తంగా, లేక ప్రలోభాలతో సాగే మత మార్పిడీలు నేరమన్నారు. దరిమిలా శాంతి భద్రతల సమస్యలూ తలెత్తుతాయని చెప్పారు. బీజాపుర జిల్లా  గిరిజన తాండాల  లంబా డీలు చాలా మంది క్రైస్తవ మతానికి మారరని మరో సభ్యుడు దేవానంద్‌ తెలిపారు. తాండాల్లో్ ఎక్కడ పడితే అక్కడ చర్చిలు వెలిసాయని పేర్కొన్నారు. సభాపతి విశ్వేశ్వర హెగ్డే  కాగేరి, మరి కొందరు సభ్యులు ఉత్తర ప్రదేశ్‌ లో మాదిరి మత మార్పిడీ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos