జమ్ముకాశ్మీర్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

జమ్ముకాశ్మీర్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా దళాలకు, నలుగురు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఆర్మీ, పారామిలటరీ దళాల భద్రతా సిబ్బంది సుమారు రెండుగంటలుగా ఉగ్రవాదులతో పోరాడుతున్నారని భద్రతా దళాలు మంగళవారం ప్రకటించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతాదళాలు కుల్గాం, షోపియాన్‌లో కూంబింగ్‌ నిర్వహించాయి. కాల్పులు మొదట కుల్గాంలో ప్రారంభమై, షోపియాన్‌లోని అటవీ ప్రాంతాలనికి చేరాయని భద్రతావర్గాలు పేర్కొన్నాయి. ఇది చాలా కీలకమైన సమయమని భద్రతా వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఉగ్రవాద దాడిని ఇప్పుడు యుద్ధ చర్యగా చూస్తామని, కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos