అశోక్ లేలాండ్ ని ఎందుకు విచారించలేదు

అశోక్ లేలాండ్ ని ఎందుకు విచారించలేదు

అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ఈడీ… రూ. 22.10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విషయంలో తమకు వాహనాలను అమ్మిన అశోక్ లేలాండ్ ని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. అశోక్ లేలాండ్ కంపెనీ వాహనాలను అమ్మకపోతే అసలు స్కామే లేదని అన్నారు. రూ. 38 కోట్ల స్కామ్ అంటున్నారని, త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రిజిస్ట్రేషన్లు జరిగిన నాగాలాండ్ లో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ఈడీ తీసుకున్నందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos