బీజేపీ నేత ఇల్లు బుల్‌డోజర్‍తో కూల్చివేత

బీజేపీ నేత ఇల్లు బుల్‌డోజర్‍తో కూల్చివేత

లక్నో: నోయిడా ఒమాక్సీ హౌసింగ్ సొసైటీలో బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగికి చెందిన అక్రమ నిర్మాణాన్ని పాలకులు సోమవారం బుల్డోజర్లతో కూల్చివేశారు.గత శుక్రవారం శ్రీకాంత్ త్యాగి పొరుగింటి మహిళను కొట్టి, దుర్భాషలాడాడు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. శ్రీకాంత్ త్యాగి ఇంటిముందు అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని హౌసింగ్ సొసైటీ 2019లోనే ఫిర్యాదు చేసింది. నోయిడా అధికారులు 2020లోనే త్యాగికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నేరుగా బుల్డోజర్లతో వెళ్లి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అయితే యూపీలో ఇప్పటి వరకు విపక్షాలకు చెందిన వారినే లక్ష్యంీగా చేసుకుని బుల్డోజర్లతో ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు బీజేపీ కార్యకర్త ఇంటిపైకే అధికారులు బుల్డోజర్ తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos