ప్రైవేటీకరణ ప్రయోజనాలు మెరుగైన పాలనతోనూ సాధ్యం

ప్రైవేటీకరణ ప్రయోజనాలు మెరుగైన పాలనతోనూ సాధ్యం

న్యూ ఢిల్లీ : ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో కలిగే ప్రయోజనాలను మెరుగైన పాలనతోనూ పొందవచ్చని రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మాజీ గవర్నర్ రఘు రామ్ రాజన్ తేల్చి చెప్పారు. ‘న్యూ ఎకానమి- రీడిజైన్ ది వరల్డ్ ‘ క్లబ్ హౌస్. కామ్లో సదస్సులో పాల్గొన్నారు. తగిన నియంత్రణ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగానికి ఇస్తే ఆ రంగం గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది. ఆ సంస్థలకు ప్రజలు అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ వ్యక్తులకు పూర్తిగా విక్రయించడానికి బదులుగా ప్రభుత్వం తన వాటాను తగ్గించుకోవచ్చు. పాలనను మెరుగుపరచడంపై ఎందుకు దృష్టి పెట్టకూడదు? పబ్లిక్ ఇష్యూల ద్వారా ప్రైవేటీకరించవచ్చు. వాటాలను ప్రజలకు విక్రయించ వచ్చు. ఉదాహరణకు ఐసిఐసిఐ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్గా మారింది. పబ్లిక్ బ్యాంక్ కంటే ఎక్కువ. బ్యాంకింగ్లో కూడా ప్రైవేట్ రంగానికి తగిన స్థాయిలో పోటీ ఉంది. వాటికి పోటీగా ప్రభుత్వ రంగం అవసరం. ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాం. ప్రభుత్వరంగ ఆస్తులుగా ఎందుకు ఉంచకూడదో అర్థంకావడం లేదు. ప్రైవేట్ రంగం దోపిడీ చేయకుండా నిబంధనలు, నియమాలు రూపొందించాలి. మెరుగైన పాలన, నిబంధనల ద్వారా ప్రైవేటీకరణతో కలిగిన ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్యం, విద్యపై ప్రభు త్వం తగిన ప్రాధాన్యత కల్పించలేదు. వాటిసై వ్యయన్ని తగ్గించారు. డబ్బు ఎక్కడికిపోయింది? జిడిపిలో అప్పు 90 శాతానికి పైగా ఉంది. ప్రజలు మరింత పేదరికంలో జారిపోయారనేందుకు ఆధారాలున్నాయి. ప్రజల సామర్థ్యాలను పెంచడానికి, విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం నగదు ఖర్చు చేస్తామన్న వాగ్దానాలే ఉన్నాయి. పరిస్థితులు మరిం త దిగజారుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే పరిస్థితని, మేము ఖర్చు చేయము అని చెప్పడం సరికాదని, అవసరమైన చోట ఖర్చు చేయడం ముఖ్యం. వనరు లను పెంచి, అవసరమైన చోట ఖర్చు చేయాలి. విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం మరింత ఖర్చు చేయాలి. ఇవి కచ్చితంగా క్లిష్టమైన సమస్యల’ని రాజన్ పేర్కొన్నారు.

తాజా సమాచారం