జనవరి నుంచి పింఛన్ ను రూ.2,750

కుప్పం: వచ్చే జనవరి నుంచి పింఛన్లను రూ.2,750కి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ఇది వరకే చెప్పినట్లుగా దాన్నిదశల వారీగా రూ.3 వేలకు పెంచుతామని చెప్పారు. ప్రస్తుత పింఛన్ రూ.2,500లు. వైఎస్సార్ చేయూత కింద మూడో విడత నిధులను విడుదల చేసారు. ‘మా ప్రభుత్వం మహిళల ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. అమ్మ ఒడి ద్వారా అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం. గడచిన మూడేళ్లలోనే మహిళలకు రూ.1.17 లక్షల కోట్లను పంపిణీ చేశాం. ప్రభుత్వ పథకాల అమలులో లంచాలు లేవు. మధ్యవర్తులు లేరు. వివక్ష లేద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos