హైదరాబాద్ : మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో బుధవారమూ ఆదాయపు పన్ను శాఖ అధికార్ల తనిఖీలు జరుగుతున్నాయి. సినిమాకు పెట్టిన పెట్టుబడులు, వచ్చిన కలెక్షన్లపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ‘పుష్ప 2’ సినిమా ఇప్పటి వరకు రూ. 1,700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, వచ్చిన ఆదాయం ఎంతో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. దాదాపు 55 ఐటీ అధికారుల బృందాలు హైదరాబాద్ లో ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వచ్చిన ఆదాయం ఎంత? కడుతున్న ట్యాక్స్ ఎంత? అనే విషయంలో అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.