ఎయిర్‌పోర్టుల మూసివేత.. చిక్కుకుపోయిన వేల మంది

ఎయిర్‌పోర్టుల మూసివేత.. చిక్కుకుపోయిన వేల మంది

న్యూ ఢిల్లీ:ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్‌ భారీ క్షిపణి దాడులకు పాల్పడుతుండడంతో ఇరాన్‌ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. లెబనాన్‌, జోర్డాన్‌, ఇరాక్‌లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు మూతపడటంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10వేలకు పైగా ప్రయాణికులు ఇరాన్‌ సహా పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు ఓ రిటైర్డ్‌ పైలట్‌, విమానయాన భద్రతా నిపుణుడు జాన్ కాక్స్ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos