ఇదేనా ధోని క్రీడా స్ఫూర్తి ?..ధోనిని చూసి యువక్రికెటర్లు అదే నేర్చుకోవాలా ?

  • In Sports
  • October 14, 2020
  • 23 Views
ఇదేనా ధోని క్రీడా స్ఫూర్తి ?..ధోనిని చూసి యువక్రికెటర్లు అదే నేర్చుకోవాలా ?

రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.బ్యాట్స్ మేన్స్ అంత పెవిలియన్ చేరడంతో చివర్లో 11 బంతుల్లో సన్‌రైజర్స్ విజయానికి 25 రన్స్‌గా సమీకరణం మారింది. ఈ దశలో.. శార్దుల్ నెక్స్ట్ ‌బాల్‌ను వికెట్లకు దూరంగా యార్కర్ వేసే ప్రయత్నం చేశాడు. అది కూడా వికెట్లకు దూరంగా.. ట్రేమ్‌లైన్ అవతల.. లో ఫుల్ టాస్‌గా పడింది. రషీద్ షాట్ ఆడే ప్రయత్నం చేసిన బంతి అతడి బ్యాట్‌కు అందకుండా వికెట్ల వెనుక ఉన్న ధోనీ చేతుల్లో పడింది.దీంతో అంపైర్ పాల్ రౌఫెల్ వరుసగా రెండోసారి వైడ్ ఇవ్వడం కోసం చేతులు చాపుతుండగా.. ధోనీ, శార్దుల్ ఠాకూర్.. అదెలా వైడ్ అన్నట్లుగా స్పందించారు. ధోనీ అయితే.. చేతులు చాపుతూ.. ముందు బంతి పడిన ప్రదేశాన్ని చూపిస్తూ… అంపైర్ వైపు సీరియస్‌గా చూశాడు. దీంతో కొద్ది మేర చేతులు పైకెత్తిన అంపైర్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒకవేళ అది వైడ్ కాకపోయి ఉంటే.. కచ్చితంగా రషీద్ బ్యాట్‌కు తాకి ఉండాలి. అప్పుడు ధోనీ వైడ్ కాదని కాకుండా ఔట్ అని అప్పీల్ చేసేవాడు. కానీ అది స్పష్టంగా వైడ్ బాల్ అని తెలిసినా.. అంపైర్‌ను ప్రభావితం చేసేలా ధోనీ హవభావాలు ఉన్నాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ వ్యవహార శైలి పట్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos