వృద్ధాశ్రమంలో అరాచకం..

వృద్ధాశ్రమంలో అరాచకం..

పండుటాకుల సేవా కేంద్రమని బోర్డు పెట్టి మానసిక దివ్యాంగుల కేంద్రాన్ని నడపడమేకాక, వారిపట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న మమత వృద్ధాశ్రమంపై పోలీసులు కేసు నమోదు చేశారు.హైదరాబాద్శివారు కీసర పోలీస్స్టేషన్పరిధిలోని నాగారంలో ఉన్న వృద్ధాశ్రమంలో అనధికారికంగా మానసిక దివ్యాంగుల కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక్కో మానసిక వికలాంగుడి కుటుంబ సభ్యుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. కానీ కనీస వసతులు చూపించడం లేదు సరికదా తామేం చేస్తున్నామో తమకే తెలియని దివ్యాంగుల పట్ల కనీసం మానవత్వం కూడా చూపించడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఒకే గదిలో 50 మందికిపైగా వృద్ధులను ఉంచుతూ, వారిని నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే విషయాన్ని స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక దీంతో పోలీసులు పునరావాస కేంద్రంపై దాడి చేసి అక్కడ పరిస్థితులను అక్కడ ఉన్న వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో మానసిక దివ్యాంగులను గొలుసులతో బంధించి వారిని కర్రలతో కొడుతున్నారని పోలీసులు కూడా గుర్తించారు.బాధిత కుటుంబాల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవడమేకాక అనుమతి లేకుండా దివ్యాంగుల కేంద్రాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. వృద్దాశ్రమాల్లోనే కాదు చిన్నారుల పునరావాస కేంద్రాలలోనూ వేధింపులు, చిత్రహింసలు కొనసాగుతున్నాయి. స్వచ్చంద సంస్థలు, ఆశ్రమాల మాటున దోపిడీకి పాల్పడుతున్నారు . ఇలాంటి ఆశ్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos