నిర్భయ తల్లి సోనియాగాంధీలా ఆలోచించాలి..

నిర్భయ తల్లి సోనియాగాంధీలా ఆలోచించాలి..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన నిందితుల ఉరికి దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించగా.. ఆశాదేవి ఎందుకు వారిని క్షమించడం లేదన్నారు. ‘నిర్భయ తల్లి ఆశాదేవి పడే మనోవేదన తెలుసు, కానీ ఆమె ఎందుకు సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ హతమార్చిన నళినికి సోనియా క్షమాభిక్ష ప్రసాదించారు కదా అని గుర్తుచేశారు. నళినికి ఉరిశిక్ష విధించాలని అనుకోవడం లేదు అని సోనియా చాలా సందర్భాల్లో చెప్పారు. నిర్భయ ఘటనపై మేమంతా మీతో ఉన్నాం, కానీ ఉరిశిక్షకు మాత్రం తాను వ్యతిరేకమన్నారు. సోనియా గాంధీ లాగా ఎందుకు ఆశాదేవి పెద్ద మనసు చేసుకోవడం లేదు అని’ ఇందిరా జై సింగ్ ట్వీట్ చేశారు.ఇందిరా జై సింగ్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22వ తేదీన ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉండగా నిందితుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ క్షమాభిక్ష కోరడం, దానిని రాష్ట్రపతి తిరస్కరించడంతో ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు డెత్‌వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos