టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌..

  • In Sports
  • November 24, 2019
  • 59 Views
టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌..

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతోన్న చారిత్రాత్మక పింక్ బాల్, డే/నైట్ టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్, 46 పరుగులతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.  టీమిండియా 347/9 కి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మూడో రోజు ఆటలోనూ బంగ్లా బ్యాట్స్ మెన్ ఒకరి తర్వాత ఒకరు పెవీలియన్ కు క్యూకట్టారు. షాద్మాన్ ఇస్లాం 0, ఇమ్రుల్ 5, మోమినుల్ 0, మిథున్ 6, రహీం 74, మహ్మదుల్లా 39 (రిటైర్డ్ హర్ట్), మిరాజ్ 15, తైజుల 11, అల్ అమిన్ 21, ఎడాబట్ 0 పరుగులకు వెనుదిరిగారు. అబు జాయెద్ 2 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 41.1 ఓవర్లకి 195 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది.దీంతో టెస్టు సిరీస్‌ను భారత్‌ 2-0తో వైట్‌వాష్‌ చేసింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos