కొందరు యాంకర్లు.. టీవీ షోల బాయ్‌కాట్

కొందరు యాంకర్లు.. టీవీ షోల బాయ్‌కాట్

న్యూ ఢిల్లీ : విపక్ష ఇండియా కూటమి కొందరు టీవీ యాంకర్లను, షోలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఆ యాంకర్లు, షోల జాబితాను ఇండియా కూటమి మాధ్యమ ఉప సమితి రూపొందిస్తుందని సమన్వయసమితి తెలిపింది. ఢిల్లీలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఇండియా కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మీడియా సంస్థలు తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కొన్ని మీడియా సంస్థలు పట్టించుకో లేదు. కనీస కవరేజీ కూడా ఇవ్వలేదు. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభించినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా విస్మరించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ప్రధాన మీడియా ‘భారత్ జోడో యాత్ర’ను బాయకాట్ చేసిందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. మే 2019లోనూ కాంగ్రెస్ నెల రోజులపాటు టీవీ షోలను బాయ్కాట్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos