ప్రభుత్వ సంస్థల విక్రయాలు పెద్ద కుంభ కోణం

ప్రభుత్వ సంస్థల విక్రయాలు పెద్ద కుంభ కోణం

న్యూ ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణపై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసించింది. ఈ అంశాలను ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎలక్టోరల్ బాండ్ల జారీ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాల్ని పెద్ద కుంభ కోణంగా అభివర్ణించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ సభా మధ్య భాగానికి దూసు కెళ్లారు. లోక్సభలో కాంగ్రెస్ పా ర్టీ భ్యులు దాదాపు 15 నిమిషాల పాటు నిరసించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలగనీయరాదని సభాపతి ఓం బిర్లా సలహాల్ని ఖాతరు చేయలేదు. ‘హుందాగా ప్రవర్తించడం ప్రతి సభ్యుడి బాధ్యత. ఎంతో ప్రాధాన్యమైన క్రీడాకారుల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో సభ్యులు ఇలా ప్రవర్తించడం సరికాదు. మీరు సీనియర్లు, దయచేసి సభా మధ్య భాగంలోకి రావ ద్దు. దీనిపై శూన్య వేళలో అవకాశాన్నిస్తాన’ని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. అనంతరం సభ నుంచి నిష్క్రమిం చారు. అంతకు ముందు ఎలక్టోరల్ బాండ్ల జారీ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయించడం పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. దేశం దోపిడీకి గురవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీని గురించి మాట్లాడేందుకు అనుమతించాలని కోరారు. ‘మీరు గౌరవ సభాపతి. ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు మేం వాయిదా తీర్మానాలు ఇ చ్చాం. సభాపతి స్థానాన్ని అగౌరవపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇదో పెద్ద అంశం గనక మేం దానిపై నోటీసు ఇచ్చమ’న్నారు. రాజ్యసభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఎలక్టోరల్ బాండ్లు గురించి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు సూచన అందించారు. అయితే గురువారం చర్చనీయాంశాల్లో దాన్ని చేర్చజాలమని నిరసనకు దిగారు.దరిమిలా రాజ్యసభ వాయిదా పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos