తొలి టీ20 వరల్డ్‌కప్‌ హీరోకి ఐసీసీ,నెటిజన్లు సలాం..

  • In Sports
  • March 29, 2020
  • 186 Views
తొలి టీ20 వరల్డ్‌కప్‌ హీరోకి ఐసీసీ,నెటిజన్లు సలాం..

తొలి టీ20 ప్రపంచ కప్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులు ముఖ్యంగా భారతీయులు ఎప్పటికీ మరచిపోరు.1983 అనంతరం మొదటిసారి ప్రపంచ కప్పును కైవసం చేసుకోవడం అందులోనూ చిరకాల ప్రత్యర్థ పాకిస్థాన్‌పై నరాల తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్‌లో గెలిచి కప్పును సొంతం చేసుకున్న ఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పటికీ ప్రత్యేకమే.ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్కంఠ మధ్య ఆఖరి ఓవర్‌లో మాయ చేసి భారత్‌కు కప్పును అందించడంలో కీలకపాత్ర పోషించిన బౌలర్‌ జోగీందర్‌ శర్మపై అప్పట్లో ప్రశంసల జల్లులు కురిశాయి.మళ్లీ ఇన్నేళ్ల అనంతరం అదే జోగీందర్‌ శర్మపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ విజయంలో జోగిందర్ కీలక పాత్రను గుర్తించిన హర్యానా ప్రభుత్వం ఆ మెగా టోర్నీ అనంతరమే రాష్ట్ర పోలీస్ శాఖలో డిప్యూటీ సూప‌రిటిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఉద్యోగాన్ని క‌ల్పించింది. దీంతో ప్రస్తుతం జోగిందర్ డీఎస్పీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించగా.. జోగింధర్ హర్యానాలో పోలీస్ అధికారిగా గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా కరోనా బారిన పడకుండా రక్షణ కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే త‌న ఫొటోను షేర్ చేసిన ఐసీసీ.. రియ‌ల్ వ‌ర‌ల్డ్‌ హీరో అంటూ ట్వీట్ చేసింది. కరోనా సంక్షోభ ప‌రిస్థితుల్లో జోగింద‌ర్ పోలీసుగా అద్భుత‌మైన పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు కొనియాడింది. ‘2007 : T20 వరల్డ కప్ హీరో, 2020: రియ ల్ వరల్డ్ హీరో’నాటి, నేటి ఫోటోలను జతచేసింది. ఇక ఫ్యాన్స్ కూడా జోగిందర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అప్పుడు క్రికెట్ పిచ్ మీద కీలక సమయంలో రాణించిన ఈ క్రికెటర్ ఇప్పుడు ప్రాణాంతక కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు మరో పిచ్ మీద బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రాణాంతక వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం సవాల్‌తో కూడుకున్నదని క్రికెటర్ కమ్ డీఎస్పీ జోగిందర్ శర్మ తెలిపాడు. పీటీఐ వార్త సంస్థతో మాట్లాడుతూ… ‘2007 నుంచి నేను డీఎస్పీ హోదా కలిగి ఉన్నా. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించడం.. సవాల్‌తో కూడుకున్నది. ఇప్పటి వరకు నా పోలీస్ కెరీర్‌లో ఈ తరహా పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.మా డ్యూటీ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. పెట్రోలింగ్ చేస్తూ.. ప్రాణాంతక వైరస్ నిర్మూలనపై ప్రజలకు అవగాహనం కల్పిస్తాం. ఎలాంటి అవసరం లేకుండా బయటకు వచ్చినవారిని ఇళ్లకు పంపిస్తాం. అవసరమైన వారికి వైద్య సాయం చేస్తాం. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారికి, సరైన కారణం లేకుండా బయటకు వచ్చిన వారిపై పోలీస్ స్టైల్లో యాక్షన్ తీసుకుంటాం’అని జోగింధర్ తెలిపాడు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos