మురుగు కాలువలో ఐబీ ఉద్యోగి శవం

మురుగు కాలువలో ఐబీ ఉద్యోగి శవం

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింసాకాండలో దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది. 26 ఏళ్ల ఇంటిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మను అల్లరి మూకలు రాళ్లతో కొట్టి చంపాయి. ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన అంకిత్ శర్మ, ఓ మురుగు కాలువలో విగతజీవిగా కనిపించినట్టు ఆయన బాబాయి వెల్లడించారు. కాగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల కారణంగా ఇప్పటికే ఓ పోలీస్ అధికారి సహా 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 250 మందికి పైగా గాయపడినట్టు గుర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos