ఐపీఎల్ సిక్సర్లలో థౌజండ్‌వాలా

  • In Sports
  • May 23, 2022
  • 103 Views
ఐపీఎల్ సిక్సర్లలో థౌజండ్‌వాలా

క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐపీఎల్ 2022 సీజన్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సింగిల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును (1000) 15వ ఐపీఎల్ ఎడిషన్ సొంతం చేసుకుంది. ఆదివారం సన్‌రైజర్స్‌-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఈ ఫీట్ నమోదైంది. పంజాబ్ హిట్టర్ లివింగ్‌స్టోన్‌ సిక్సర్‌తో (1000వ సిక్సర్) ఐపీఎల్ 2022 సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి.
అంతకుముందు 2018 సీజన్‌లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్ ముందు వరకు అత్యధికం కాగా, ప్రస్తుత సీజన్‌లో ఆ రికార్డు బద్దలైంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్, ఫైనల్ కలిపి మరో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉండటంతో మరో వంద సిక్సర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ సీజన్ తొలి సిక్సర్‌ను సీఎస్‌కే బ్యాటర్ రాబిన్ ఉతప్ప బాదగా.. థౌజండ్ వాలా సిక్సర్‌ను లివింగ్‌స్టోన్‌ పేల్చాడు. ఈ సీజన్ లాంగెస్ట్ సిక్సర్ రికార్డు కూడా లివింగ్‌స్టోన్‌ పేరిటే నమోదై ఉండటం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos