కేసీఆర్‌ డైనమిక్‌ అని విన్నాం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర
హైకోర్టు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.హైకోర్టు
కేసీఆర్‌ను ఉద్దేశించి ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేసిందో పరిశీలిస్తే..హైదరాబాద్‌ నగరంలోని
కళ్యాణ్‌నగర్‌ సొసైటీకి భూమి అప్పగించడానికి సంబంధించి రెండు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది.అటు
హైకోర్టు కూడా అందుకు సంబంధించి దాఖలైన వాజ్యంపై విచారణ జరుపుతోంది. తాజాగా వాజ్యానికి
సంబంధించి మరోసారి విచారణ జరిపిన హైకోర్టు ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైనమిక్‌ అని విన్నాం..కేసీఆర్‌
తలచకుంటే కేవలం పది నిమిషాల్లో రెండు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యను పరిష్కరించగలరు’అంటూ
వ్యాఖ్యలు చేసింది.1997వ సంవత్సరంలో సొసైటీకోసం 39 ఎకరాల భూమిని కొనుగోలు చేసి లేఅవుట్‌
కోసం కొంతమంది అనుమతులు తీసుకున్నారు.అయితే మురికివాడల అభివృద్ధి కోసం సొసైటీ భూమిని
తీసుకున్న అప్పటి ప్రభుత్వం అందుకు పరిహారంగా అంతేమొత్తం భూమిని అప్పగిస్తామంటూ హామీ
ఇచ్చింది.అయితే దశాబ్దాలు గడుస్తున్నాహామీలు నెరవేరకపోవడంతో సొసైటీ కోర్టు ధిక్కారణ
కింది పిటీషన్‌ దాఖలు చేసింది.ఈ నేపథ్యంలో పిటీషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్.. జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ లతో కూడిన ధర్మాసనం
వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్ తివారికి ఆదేశాలు ఇచ్చారు.కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన రాజేశ్‌ తివారి ప్రభుత్వం వద్ద ఈ ఇష్యూ పెండింగ్ లో ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారని.. ఎంతకాలం పెండింగ్ లో ఉంచుతారని ప్రభుత్వ అధికారిని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన తివారీ.. ఈ అంశంపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోవాలని.. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి అధీనంలో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం..ఇతర నేతల
కంటే మీ నాయకుడు కేసీఆర్‌ చాలా డైనమిక్‌గా ఉంటారని విన్నామని విధి నిర్వహణలో విఫలమైనా,నిర్లక్ష్యం
వహించినా అధికారులను నిలదీస్తారని కూడా విన్నామని పేర్కొంది.కేసీఆర్‌ తలచుకుంటే కేవలం
పది నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తారని పేర్కొంది.చివరగా ఎన్ని రోజుల్లో ఇష్యూను పరిష్కరిస్తారని కోరగా.. ఎనిమిది వారాల గడువు కోరారు. అందుకు నిరాకరించిన కోర్టు నాలుగు వారాల్లో ఇష్యూ క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి.. ఈ ఇష్యూపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos