హ్యాట్సాఫ్ టు కేసీఆర్

హ్యాట్సాఫ్ టు కేసీఆర్

అమరావతి: దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎదురు కాల్పుల్లో హతం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మో హన రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, పోలీసుల్ని అభినందించారు. సోమవారం విధానసభలో ఆయన ప్రసంగించారు. ‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్ గారూ. తెలంగాణ పోలీసులు. దిశ నిందితులను ఎదురు కాల్పుల్లో చంపేసారు. సినిమాల్లో దోషులను చంపితే చప్పట్లు కొడతారు. నిజ జీవితంలో దమ్మున్న వారు ఎవరైనా ఇలాంటి పని చేస్తే మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ నుంచి పరిగె త్తుకుంటూ వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయ’ని వ్యాఖ్యానించారు. ‘నాలుగు నెలల్లో తీర్పు నిచ్చి, శిక్ష వేయాలని నిర్భయ చట్టం చెబుతోంది. ఈ రోజుకి కూడా నిర్భయ దోషులకు శిక్ష పడలేదు. మన రాష్ట్రంలో ఆడ పిల్లలకు భద్రతపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులను కాల్చేయాలని ఎవరూ అనుకోరు. న్యాయ స్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా న్యాయం జరగడంలో జాప్యం జరుగు తుందనిపిస్తే మాత్రం ప్రజల్లో ఆగ్రహం తన్ను కొస్తుం ద’ని జగన్ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos