హత్రాస్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్..

హత్రాస్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.ఈ ఉదంతంలో బాధితురాలి ఫోటో అంటూ చనిపోయిన తన భార్య ఫోటోను వాడుతున్నారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనతో హత్రాస్ గ్యాంగ్ రేప్ జరిగినప్పట్నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న బాధితురాలు ఫోటోలు నిజం కాదని స్పష్టం అవుతుంది.ఈ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు.. సోషల్ మీడియా దిగ్గజాలైన పేస్ బుక్,గూగుల్ కు షాకిచ్చింది.ఈ ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై పిటిషన్ దారుడు స్పందిస్తూ.. తన భార్య చనిపోయిందని ఆమె ఫోటోలను హత్రాస్ బాధితురాలి ఫోటోలుగా వాడుతున్నారని ఆరోపణలు చేశాడు. సోషల్ మీడియా సర్కిల్స్ లో ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా మాట్లాడుతూ.. ‘సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నిజమని తేలితే.. ప్రభుత్వం ఫేస్ బుక్ గూగుల్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలకు ఆదేశాలు జారీ చేయడమే కాక వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిటిషనర్ సమర్పించిన దృష్ట్యా మొదటి ప్రతివాదిగా ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మంత్రిత్వ శాఖ సదరు వ్యక్తి ఫిర్యాదుని పరిశీలించాలి. ఒకవేళ నిజమని తేలితే దానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలి. ఈ ఉత్తర్వు కాపీని స్వీకరించిన మూడు రోజుల వ్యవధిలో గూగుల్ ఫేస్ బుక్ ట్విట్టర్ లకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెల 9న జరగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos