రాజగోపాల్ రెడ్డి మునుగోడులో మునగడం ఖాయం

రాజగోపాల్ రెడ్డి మునుగోడులో మునగడం ఖాయం

నల్గొండ: కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘ రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరం. ఆ పార్టీ ఒత్తిడితోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీ లో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరు. మునుగోడు ఎన్నికల్లో మునగడం ఖాయం. ఉప ఎన్నికల్లో గెలవనని రాజగోపాల్ రెడ్డికీ తెలుసు. మునుగోడులో పోటీ చేయాలని ఎవరూ నన్ను అడగలేదు. అడిగితే ఆలోచిస్తా. ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్న’ట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos