ప్రజలు, కాంగ్రెస్‌ నేతల మధ్య సంబంధం తెగింది

ప్రజలు, కాంగ్రెస్‌ నేతల మధ్య సంబంధం తెగింది

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలి పోయిందని ఒక మాధ్యమ సంస్థ ముఖాముఖిలో పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ‘మా పార్టీ వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని తిరిగి పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలో ఎవరైనా నేతను ఎన్నికల విధానంలో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యవస్థ సమర్ధవంతంగా పని చేస్తుంది. కేవలం నేతను మార్చినంత మాత్రాన విజయాల బాటలో నడవలేము. అలా చేసి హార్, యూపీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలను గెలుచుకుంటామని నేను అనడం లేదు. ఒకసారి వ్యవస్థలో మార్పు మొదలైతే, తర్వాతి విజయాలకు చేరువ కావచ్చు.ఇది నాయకత్వ సమస్య కాదు. ప్రజలకు కాంగ్రెస్ నేతలకు మధ్య సంబంధం తెగిపోయింది. నేతలు స్టార్ హోటళ్లను వీడి క్షేత్ర స్థాయిలోకి దిగాలి. క్షేత్ర స్థాయిలో పనిచేస్తేనే ఫలితాలు కనిపిస్తాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా ఎందుకు కోల్పోతున్నామో గుర్తించాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos