పోలీసు వాహనంపై గ్రెనెడ్ దాడి

పోలీసు వాహనంపై గ్రెనెడ్ దాడి

పూంచ్ : పూంచ్ జిల్లా కాలియా వంతెన ప్రాంతంలో గురువారం రాత్రి పోలీసు వాహనంపై అనుమానిత ఉగ్రవాది గ్రెనెడ్ విసిరాడు. ఆ గ్రెనెడ్ పేలక పోవడంతో పోలీసులకు పెద్ద ప్రమాదం తప్పింది. జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్ నుంచి సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీ ప్రాంత గ్రామాలకు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కు ఆయుధాలు చేరవేస్తున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలతో తనిఖీలు జరిపారు. గ్రెనెడ్ దాడి అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos