10 న థియేటర్లలో సీటీమార్

10 న థియేటర్లలో సీటీమార్

హైదరాబాదు : గోపీచంద్ కథా నాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘సీటీమార్’ 10 న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తమన్నా కథానాయిక. కబడ్డీ ఇతి వృత్తంగా కథ నడుస్తుంది. సినిమాగా పక్కా కమర్షి యల్ ఉంటుందని గోపి చంద్ విలేఖరులకు తెలిపారు. ‘మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా వరకూ పూర్తయింది. జోడీగా రాశిఖన్నా కనిపిస్తుంది. ఇక ఆ తరువాత దర్శకుడు శ్రీవాస్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాను. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. మా హోమ్ బ్యానర్ అయిన ఈతరం ఫిలిమ్స్ ను మళ్లీ మొదలు పెట్టాలను కుంటున్నా. ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అందుకు కాస్త సమయం పట్టొచ్చు” అని పేర్కొన్నారు.

తాజా సమాచారం