గూగుల్ ఇండియా పాలసీ హెడ్ అర్చనా గులాటీ రాజీనామా

గూగుల్ ఇండియా పాలసీ హెడ్ అర్చనా గులాటీ రాజీనామా

న్యూ ఢిల్లీ: గూగుల్ ఇండియా గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ హెడ్ పదవికి అర్చనా గులాటీ రాజీనామా చేశారు. ఐదు నెలల కిందట నీతి ఆయోగ్ జాయింట్ సెక్రటరీ (డిజిటల్ కమ్యూనికేషన్స్) ఉద్యోగానికి రాజీనామా చేసి గూగుల్ లో పాలసీ హెడ్ గా బాధ్యతలను స్వీకరించారు. ఆమె రాజీనామాకు గల కారణాలపై అర్చన లేక గూగుల్ ఇండియా ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. మాధ్యమ ప్రతినిధులతో దీని గురించి స్పందించేందుకు తిరస్కరించారు. యాంటీ ట్రస్టు కేసులతో పాటు టెక్ సెక్టార్ రెగ్యులేషన్స్ కు సంబంధించిన సమస్యలను గూగుల్ ఎదుర్కొంటున్న సమయంలో అర్చన రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos