మావోయిస్టులు 10 నిమిషాల్లో చంపేసి పోతారు

మావోయిస్టులు 10 నిమిషాల్లో చంపేసి పోతారు

కరీం నగర్: ‘టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో ఎంపీటీసీల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతిలో కూరుకుపోయారు. అందుకే టీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయ’ని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు చెప్పారు. సోమవారం కరీం నగర్లో విలేఖరులతో మాట్లాడారు. ‘ టీఆర్ఎస్ నేతలు దోపిడీని ఆపేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో మావోయిస్టులు వస్తారు. పది నిమిషాల్లో అందరినీ చంపేసి పోతారు. అన్నలు చాలా సీరియస్ గా ఉన్నారు తలచుకుంటే పది నిమిషాల్లో పని కానిచ్చేసి రాష్ట్రం దాటి వెళ్లిపోతారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు. అయినా ఆయన చర్యలు తీసుకోవడం లేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి బావ రూ. 8 కోట్ల విలువైన ఆస్తిని ఆక్రమించినా అతనిపై చర్యలు లేవు. టీఆర్ఎస్ నేతల అరాచకాలు చూస్తుంటే నాకే వారిని చంపేయాలని పిస్తోంద’ని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos