గోమూత్ర పార్టీ ఆరంభం

గోమూత్ర పార్టీ ఆరంభం

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ విస్తరణ భయంతో ఢిల్లీ పాక్షికంగా మూతపడిన దశలో అఖిల భారతీయ హిందూ మహాసభ శనివారం ఇక్కడ గో మూత్ర పార్టీని ఆరంభించింది. సంబంధిత పత్రాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనమయ్యాయి. హిందూ మహాసభ, జన్ జాగరణ్ మంచ్, యూత్ సనాతన్ సేవా సంఘ్ ఈ పార్టీని నిర్వహించ నున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ను తుదముట్టించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కరోనా వైరస్ను సమర్ధవంతంగా నిరోధించడంలో గోవు మూత్రం, పేడ, ఇతర ఉత్పత్తులు ఎంతో సహాయకారిగా ఉంటాయని హిందూ మహాసభకు చెందిన చక్రపాణి మహరాజ్ తెలిపారు. జనం ఎలా అయితే టీ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారో, ఆ తరహాలోనే గో మూత్ర పార్టీ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి హాజరయ్యే వారందరికీ గో మూత్రాన్ని సరఫరా చేస్తామని చెప్పారు. గోవు పేడతో తయారు చేసిన కేక్లు, అగర్ బత్తీలు ప్రదర్శనకు ఉంచుతామన్నారు. ఇదే తరహా పార్టీలు ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్వహిస్తామని చక్రపాణి మహరాజ్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos