అహ్మదాబాద్‌లో 100 కిలోల బంగారం పట్టివేత

అహ్మదాబాద్‌లో 100 కిలోల బంగారం పట్టివేత

అహ్మదాబాద్‌:నగరంలో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అహ్మదాబాద్‌లోని పాల్ది  ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపు 100 కిలోలకుపైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్మగ్లింగ్‌ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో గల అవిష్కార్ అపార్ట్‌మెంట్‌ లో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు రైడ్స్‌ చేసిన 107 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 88 కేజీలు బంగారు కడ్డీలు, 19.66 కిలలో ఆభరణాలు ఉన్నాయి. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్లో రూ.100 కోట్లకుపైమాటే అని అధికారుల అంచనా. బంగారంతోపాటు రూ.2 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos