ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌

ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌

న్యూ ఢిల్లీ: హర్యానాలోని పంచకులలో గల మిట్స్ హెల్త్ కేర్ ఫార్మా సంస్థ డైరెక్టర్ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్ కార్ల ను బహుమతిగా అందజేశారు. కంపెనీలోని 12 మంది ఉద్యోగుల్ని ‘స్టార్ పర్మార్మర్లుగా’ గుర్తించిన ఆయన కార్లను గిఫ్ట్గా ఇచ్చారు. అయితే, ఆ 12 మందిలో ఆఫీస్ బాయ్ కూడా ఉండటం విశేషం. భవిష్యత్తులో మరికొంతమంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇస్తానంటూ ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా భాటియా మాట్లాడుతూ.. ‘నా సంస్థ విజ యంలో ఉద్యోగులదే కీలక పాత్ర. వారంతా ఎంతో శ్రమ, అంకితభావం, నమ్మకంతో పనిచేసి కంపెనీ ఎదుగుదలకు సహకరించారు. కార్లను గిఫ్ట్గా పొందిన వారిలో కొందరు కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి నా వెంటే ఉన్నారు. ఈ కార్లు కేవలం దీపావళి కానుకలు కాదు.. కంపెనీపై ఉద్యోగులు చూపించిన విశ్వాసానికి, నిబద్ధతకు బహుమతులు. త్వరలో మరో 38 మంది ఉద్యోగులకు కార్లు అందజేస్తాం’ అని భాటియా పేర్కొన్నారు. మరోవైపు ఊహించని గిఫ్ట్తో ఉద్యోగులు సంతోషంతో మునిగి తేలిపోయారు. కంపెనీ కారును గిఫ్ట్గా ఇస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అయితే, గిఫ్ట్గా కారు అందుకున్న వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా రాదని సదరు ఉద్యోగులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos