ఎంఎస్పీ వల్ల ఆర్థిక సంక్షోభం

ఎంఎస్పీ వల్ల ఆర్థిక సంక్షోభం

న్యూఢిల్లీ: సాగు చట్టాలపై తాము సమర్పించిన నివేదకను బహిర్గతం చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణకు న్యాయస్థాన సమితి సభ్యుడు అనిల్ ఘన్వత్ లేఖ రాశారు. రైతు చట్టాలు రద్దు కానున్నందున సంబంధిత సమితి నివేదికకు కాలం చెల్లినందున అందులో సూచనలు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగ పడతాయని ఆ లేఖలో ఘన్వత్ పేర్కొన్నారు. ”కొందరు నేలు తప్పుదారి పట్టించడం వల్ల రైతుల్లో కొన్ని ఆపోహలు ఏర్పడ్డాయన్నది నా అభిప్రాయం. ఆ అపోహలను తేలికపరచడంలో కమిటీ నివేదిక కీలక పాత్ర పోషించింద’న్నారు. అవి అమలయ్యేలా చట్టాల్ని వరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ‘రాబోయే రెండు మూడు నెలల్లో దేశవ్యాప్తంగా పర్యటించి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు మద్దతుగా లక్ష మందికి పైగా రైతులను సమీకరిస్తాన’ని విలేఖరులతో అన్నారు. రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రస్తుతానికైతే సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంఎస్పీకి చట్టం తీసుకువస్తే ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos