తుక్కు వ్యాపారికి అంత డబ్బెక్కడిది?

తుక్కు వ్యాపారికి అంత డబ్బెక్కడిది?

ప్రజావాహిని – బెంగళూరు

కంపి చక్కెర మిల్లును రూ.నాలుగైదు వందల కోట్లకు అబ్దుల్‌ అజీజ్‌ అనే వ్యక్తి ఎలా కొనగలిగారో తనిఖీ చేయించాలని కంప్లి సభ్యుడు గణేశ్‌ శుక్రవారం విధానసభలో ప్రభుత్వాన్ని డిమాండు చేసారు. ‘అబ్దులు అజీజ్ పాత ఇనుప సామాన్ల వ్యాపారి. ఆయన బ్యాంకు ఖాతాలో నిల్వ రూ. ఐదారు లక్షలు మించదు. అలాంటి వ్యక్తి రూ. నాలుగైదు వందల కోట్ల కు చక్కెర మిల్లును ఎలా కొంటారు? మిల్లు కు చెందిన 176 ఎకరాల భూముల్ని కాపాడుకోకుండా ప్రభుత్వ అధికార్లు ఆయనకే కట్టబెట్టేందుకు తాప్రత్రయపడతున్నార’ని దుయ్యబట్టారు. మిల్లు అమ్మకాల గురించి మంత్రి శంకర పాటిల్‌ విపులీకరించారు. న్యాయ సంబంధమైన అంశాల్ని ప్రస్తావించారు. సభా వ్యవహారాల మంత్రి మాధుస్వామి సలహా ప్రకారం ఈ అంశం పై స్వల్ప కాలిక చర్చకు సభాపతి  విశ్వేశ్వర హెగ్డే కాగేరి సమ్మతించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos