గంభీర్‌ గొప్ప మనసు..

గంభీర్‌ గొప్ప మనసు..

తనలో దూకుడు మాత్రమే కాదని కరుణాత్మక హృదయం కూడా ఉందంటూ మాజీ క్రికెటర్,బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నిరూపించుకున్నారు.గుండెజబ్బుతో బాధ పడుతున్ననేపథ్యంలో భారతదేశంలో చికిత్స చేయించుకోవడానికి పాకిస్థాన్ దేశానికి చెందిన ఆరేళ్ల చిన్నారితో పాటు తల్లితండ్రులకు వీసా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడంతో గంభీర్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఉమామియా అలీ అనే 6సంవత్సరాల వయసున్న చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆ చికత్స కోసం భరత్ కు వచ్చేందుకు వారు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా పొందడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ గంభీర్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జయశంకర్ ను వారికి వీసా ఇచ్చే ఏర్పాట్లు చేయమని కోరారు.దీనిపై వెంటనే స్పందించిన మంత్రి జయశంకర్ చిన్నారితోపాటు ఆమె తల్లిదండ్రులకు కూడా వీసాలు జారీ చేయవలిసిందిగా పాకిస్తాన్ లోని భారత హై కమిషన్ కు చెప్పారు. జయశంకర్ ఆదేశాలానుసారం భారత దౌత్యాధికారులు వారికి వీసాలు జారీ చేశారు.దీంతో గంభీర్ సామాజిక మాధ్యమాల ఖాతాలో‘ నేను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకిని తప్ప పాకిస్తాన్ ప్రజల వ్యతిరేకిని కాను. ముక్కుపచ్చలారని ఈ చిట్టితల్లి భారత్ లో వైద్యం చేయించుకొని ప్రాణాలు దక్కించుకుంటే, అంతకంటే ఆనందమేముంటుంది!” అని పోస్ట్ చేశారు.దీనిపై నెటిజన్లతో పాటు గంభీర్ అభిమానులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos