ధోనీ కారణంగానే ఆ అవకాశం కోల్పోయా..

  • In Sports
  • November 18, 2019
  • 58 Views
ధోనీ కారణంగానే ఆ అవకాశం కోల్పోయా..

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్మ్యాచ్ప్రతి  భారతీయుడికి చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.యువరాజ్‌ సింగ్‌ టోర్నీ ఆద్యంతం ప్రదర్శించిన ఆట తీరుతో భారత్‌ ఫైనల్‌ చేరుకోగా ఫైనల్‌ మ్యాచ్‌లో గౌతం గంభీర్‌ 97 పరుగులు చేసి భారత్‌ ప్రపంచ కప్‌ సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.అయితే ఆ మ్యాచ్‌లో తాను శతకం చేసే అవకాశాన్నికోల్పోవడానికి కారణం ఇప్పటివరకు వెల్లడించిన గంభీర్‌ తాజాగా అందుకు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు.తాను మరో మూడు పరుగులు చేస్తే సెంచరీ చేసే వాడినని సమయంలో ఏమైందో ఇప్పుడు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. తాను సెంచరీ ఎందుకు చేయలేకపోయానని తనను చాలామంది అడిగారని తెలిపారు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా తన వద్దకు ధోనీ వచ్చాడని, మూడు పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందని అన్నాడని తెలిపారు. అయితే తన మనసులో సెంచరీ కొట్టడం కంటే ప్రపంచ కప్ను గెలవడమే ముఖ్యమనే ఆలోచన మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.ధోనీ అలా చెప్పడంతోనే తాను సెంచరీ చేయాలని ఆలోచించానని అయితే తర్వాతే ధోనీ తనకు సెంచరీ చేసే అవకాశం ఇవ్వకుండా తన వ్యక్తిగత స్కోరును పెంచుకోవడం కోసం ప్రయత్నించాడని గంభీర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ధోనీ తన వ్యక్తిగత స్కోరు కోసం ఆలోచించాడని, దీంతో తనలో అసహనం వచ్చిందని పెరీరా బౌలింగ్లో తాను బౌల్డ్అయ్యానని చెప్పుకొచ్చాడు.

తాజా సమాచారం