మాట నిలబెట్టుకున్న సెహ్వాగ్‌..

మాట నిలబెట్టుకున్న సెహ్వాగ్‌..

ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల పిల్లల విషయంలో భారతజట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు.ఘటన జరిగిన అమర జవాన్లకు నివాళులర్పించిన సెహ్వాగ్ ఆ సమయంలో అమర జవాన్ల పిల్లలను చదివించే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు.తాను స్థాపించిన సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జవాన్ల పిల్లలందరికీ ఉచితంగా విద్యను అందిస్తానని తెలిపాడు. అప్పుడు చెప్పిన మాటను సెహ్వాగ్ నిలబెట్టుకున్నాడు. తన స్కూల్లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నానని.. వీరు అమరవీరుల బిడ్డలని…బ్యాటింగ్ చేస్తున్న చిన్నారి అమర జవాన్ రామ్ వకీల్ కుమారుడు ఆర్పిత్ సింగ్, బౌలింగ్ చేస్తున్న బాలుడు అమర జవాన్ విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ సోరెంగ్ అని తెలిపాడు. కాగా మరో భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ సైతం పుల్వామా అమరవీరుల కుటుంబాలకు చెందిన 100 మంది చిన్నారుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. వారి చదవులుకు అయ్యే వ్యయాన్ని గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ తరపున చెల్లిస్తున్నాడు.

తాజా సమాచారం