దూబే రాజకీయ పునాదుల సంగతేంటి..?

దూబే రాజకీయ పునాదుల సంగతేంటి..?

లక్నో : ఎనిమిది మంది పోలీసులను పొట్టన బెట్టుకున్న ముష్కురుడు వికాస్ దూబే ఇంటిని ఆదివారం పోలీసులు కూల్చిన రీతిలో ఆయన రాజకీయ పునా దుల్ని పతనం చేస్తారనేది చర్చనీయాంశమైంది. 60 కేసుల్లో నిందితుడైన దూబే కు ఎన్నో ఏండ్లుగా రాజకీయ పార్టీల అండ ఉంది. అతడిపై ఎన్ని కేసులున్నా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులంటే అతడికి భయం లేదు. చాలా మంది సీనియర్ అధికారులు పోస్టింగులకు దూబేను ఆశ్రయిస్తారు. కుల వ్యవస్థ వల్ల అతడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం గత మూడేండ్లుగా ఎదురు కాల్పుల పేరిటి అంతం చేయదలచిన దుర్మార్గుల జాబి తాలో దూబే పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. 2001 లో అతడు భాజపా నేత సంతోష్ కుమార్ శుక్లాను శివాలి పోలీసుస్టేషన్ ఆవరణలోనే హత మార్చాడు. నిర్దో షిగా బయటికి వచ్చాడు. అప్పుటి ముఖ్యమంత్రిగా ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆ తర్వాత దూబే తుపాకీని పోలీసులు అత డికే అప్పగించారు. స్థానికంగా అతడు అనధికారిక ప్రభువులాంటి వాడు. దూబే అండ లేకుండా స్థానిక రాజకీయ నాయకులు గెలవ లేరు. ఉత్తర ప్రదేశ్లో పాతుకు పోయిన కుల వ్యవస్థను అడ్డం పెట్టుకుని అతడు ఒక వర్గానికి నాయకుడుగా చలామణి అవుతున్నాడు. 2015 లో అతడి భార్య రిచా దూబే జిల్లా పంచా యతీ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలుగా కూడా ఎన్నికయ్యారు. వికాస్ దూబే ను భాజపా పెంచి పోషిస్తోందని సమాజ్ వాది పార్టీ విమర్శించింది. ఎస్పీ నాయకులు ములా యం, అఖిలేష్ తో దూబే ఉన్న ఫోటోలను భాజపా బహిర్గతం చేసింది. ఎస్పీ మరో అడుగు ముందు కేసి యోగీ మంత్రి వర్గం లోని ఒక మంత్రికి దూబే తో సంబం ధాలు ఉన్నాయని ఆరోపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos