హొసూరులో పుష్ప విలాపం

  • In Money
  • September 12, 2019
  • 414 Views
హొసూరులో పుష్ప విలాపం

హొసూరు : ముద్ద బంతి పూల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు వాటిని రోడ్లపై పడేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సందర్భాల్లో రాచ మర్యాదలు అందుకున్న బంతి పూలు ఇప్పుడు రోడ్డుపై దిక్కు లేకుండా పడి ఉన్నాయి. దేవుళ్ల విగ్రహాలు, పటాలపై ఉండాల్సిన ఈ పూలు ఇప్పుడిలా దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి, ఓనం, దసరా పండుగలు ఉండడంతో కృష్ణగిరి జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో ముద్ద బంతిని సాగు చేశారు. వీరి అంచనాలకు తగినట్లే వినాయక చవితి సందర్భంగా కిలో రూ.40 పలికిన ఈ పూల ధర ఇప్పుడు రూ.5కు పడిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రైతులు, మార్కెట్‌కు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా రావడం లేదని రోడ్లపైనే పారబోస్తున్నారు. హొసూరు-కృష్ణగిరి జాతీయ రహదారిపై బీరపల్లి వద్ద బంతి పూలు ఈ విధంగా గుట్టలుగా పడి ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos